మర్రిమడ్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
NEWS Sep 18,2024 12:07 pm
సిరిసిల్ల జిల్లా: కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాలయ ఆవరణం, తరగతి గదులు, సరుకులు నిలువ చేసే గది, కిచెన్, స్టోర్ రూం, క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని సబ్జెక్టులలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా పాఠాలు బోధించాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా విద్యా శాఖ అధికారి రమేష్, ప్రిన్సిపాల్ ఆర్ఎస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.