జగన్‌కు బిగ్ షాక్.. బాలినేని రాజీనామా
NEWS Sep 18,2024 11:53 am
వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు అని.. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించానని అన్నారు. అంతర్గత విభేదాల కారణంగా రాజీనామా చేసిన బాలినేని త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది.