సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
NEWS Sep 18,2024 11:27 am
ఏపీలోని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనంతలక్ష్మి(55)కు సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. అవేక్ క్రానియాటమీ అని పిలిచే ఈ సర్జరీలో రోగి మేల్కొని ఉండాలి. మెదడులో కణితితో బాధపడుతున్న ఆమెకు సర్జరీ టైంలో ప్రశాంతంగా ఉండేందుకు వైద్యులు ఆమెకు ఇష్టమైన ఎన్టీఆర్ మూవీ అదుర్స్‌లోని కొన్ని సీన్లను చూపించారు. ఆమె మెదడు నుంచి కణితిని తొలగించారు. ఈ ఆపరేషన్‌కు రెండున్నర గంటల సమయం పట్టింది.