బైకునుండి డబ్బుల బ్యాగును ఎత్తుకెళ్లిన
అనుమానితుల ఫోటోలు విడుదల
NEWS Sep 18,2024 12:04 pm
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో గల్ఫ్ బేకరీ వద్ద బైకు నుండి 1లక్షా 68వేల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఎత్తుకెళ్లారు. బాధితుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా పుటేజ్ అధారంగా నలుగురు దొంగలు ఎత్తుకెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేశారు. బైకుపై వెళుతున్న నలుగురికి సంబంధించిన ఫోటోలను ఎస్సై నవీన్ కుమార్ విడుదల చేశారు. ఎవరికైన ఆ వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.