మద్యం పాలసీకి AP కేబినెట్ ఆమోదం
NEWS Sep 18,2024 11:17 am
ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం..నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. మద్యం షాపులకు గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.