ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు
స్వచ్ఛతపై అవగాహన సదస్సు
NEWS Sep 18,2024 12:05 pm
మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో బుధవారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జగదీష్ మాట్లాడుతూ.. స్వచ్ఛత, పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పరిశుభ్రతపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జగదీష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.