మోడీతోనే దేశాభివృద్ధి:
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి
NEWS Sep 18,2024 12:10 pm
దేశ భవిష్యత్తు, అభివృద్ధి కేవలం మోడీతోనే సాధ్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేటలో ఉన్న అన్న క్యాంటీన్లో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.