అలైన్మెంట్‌పై సమగ్ర సమాచారం ఇవ్వాలి
NEWS Sep 18,2024 12:10 pm
కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం క్షేత్రస్థాయిలో గ్రామాలు, మండలాలు వారీగా డివిజన్ స్థాయిలో సర్వే చేసి మ్యాపులతో సహా సమాచారం అందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులు ఆదేశించారు. అమలాపురంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం అలైన్మెంట్‌లో ఉన్న గ్యాస్ పైప్ లైన్లు, రహదారులు, భవనాలు వంటి మౌలిక వసతులు తొలగింపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.