తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద ప్లాంట్ ఏ ట్రీ ప్లాంట్ ఏ మెమొరీ కార్యక్రమం చేపట్టారు. జిఎంఆర్ హైవేస్ సీఈవో అరుణ్ కుమార్ శర్మ, ఓ అండ్ ఎం హెడ్ శంకర్ గణేషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు నాటిన చెట్లు మన మరణానంతరం ఒక జ్ఞాపకంగా భూమి మీద ఉంటాయని అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ, మేనేజర్లు పరంధామన్, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.