వాహనాల పార్కింగ్.. ట్రాఫిక్ జామ్
NEWS Sep 18,2024 10:15 am
అమలాపురం పట్టణంలోని హై స్కూల్ సెంటర్ నుంచి వెళ్లే ప్రధాన రహదారిలో షాపులకు ఎదురుగా వాహనాలను రహదారి పక్కనే పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. షాపులకు చెందిన ఫ్లెక్సీ బోర్డులను సైతం రహదారి పక్కనే ఉంచారన్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.