తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో 8 మంది జూదరులను అరెస్టు చేశామని ఎస్ఐ రవీంద్ర మంగళవారం తెలిపారు. బ్రాహ్మణగూడెం శివారు పంట పొలాల్లోని షెడ్ లో పేకాట ఆడుతూ వారు తమకు దొరికారన్నారు. వారి వద్ద నుంచి రూ.21,800 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.