గణనాథుడి ఆశీస్సులు ఉండాలి
NEWS Sep 17,2024 09:57 am
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వాసవి యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడి వద్ద బిఆర్ఎస్ యూత్ నాయకులు జిన్నా విజయ్ కుమార్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన సేవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ.. ఆ గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ, నిమజ్జన కార్యక్రమం కూడా భక్తిశ్రద్ధలతో చేయాలని ఆయన కోరారు.