సీఎం చంద్రబాబు బుడమేరు పరిశీలనలో ఊపిరిబిగబట్టే సీన్ వెలుగుచూసింది. బుడమేరు గండిని పరిశీలించేందుకు వెళ్లారు. గండి సరిగా కనిపించడంలేదని మధురానగర్ రైల్వే ట్రాక్‌పైకి ఎక్కారు. అదే సమయంలో ట్రాక్‌పై దూసుకెళ్లింది ట్రైన్. ఆ సమయంలో ట్రాక్‌పై పక్కన ఇరుకైన స్థలంలోనే చంద్రబాబు సహా ఆయన భద్రతా సిబ్బంది నిల్చున్నారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోయినప్పటికీ.. కొన్ని క్షణాలు అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.