నిరుపేద కవల పిల్లలకు
ఉచిత పాల డబ్బాలు పంపిణీ
NEWS Sep 18,2024 12:14 pm
డుంబ్రిగూడ మండలం, కండ్రూం పంచాయితీ, గోంగూడ గ్రామం, నిరుపేద కుటుంబానికి చెందిన వంతాల సొయిత w/o భగత్రామ్ కవలలకు జన్మనిచ్చి మరణించింది. ఈ నేపథ్యంలో చంటి పిల్లలైన కవలలకు రెండేళ్ల పాటూ ఉచితంగా పాల డబ్బులు ఇవ్వడానికి యూనిట్ ఫర్ ఛారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్ధ మంగళవారం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర చేతుల మీదుగా కవల పిల్లల కుటుంబానికి ఉచిత పాల డబ్బాలను అందించారు.