కారు ఢీకొని ఒకరి మృతి...!
NEWS Sep 18,2024 12:14 pm
గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్లో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొనడంతో కాథై ప్రభు అనే వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నార్నూర్ మండలం లఖంపూర్ గ్రామానికి చెందిన కాథే ప్రభుగా పోలీసులు గుర్తించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇమ్రాన్ తెలిపారు.