అరకు: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "విద్యార్ధులపై మాదకద్రవ్యాలు మత్తు పదార్థాల ప్రభావం" అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కళశాల ప్రిన్సిపాల్ డా కెబికె నాయక్ మాట్లాడుతూ.. చదువుకునే దశలో చెడు అలవాట్లకు, వ్యసనాలకు విద్యార్ధులు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్ధులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్ళాలని వైస్ ప్రిన్సిపాల్ పుష్పరాజ్ కోరారు. అనంతరం విద్యార్ధులకు చర్చా అంశంపై వ్యాసరచన పోటీ లను నిర్వహించారు.