మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక బెల్లం. గిరిజన సంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదంగా భావిస్తారు. బంగారంతో సమానంగా కొలుస్తారు. అందుకే ‘నిలువెత్తు బంగారం’ అంటారు. కోరుకున్న కోరికలు నెరవేరితే తమ బరువుకు సమానంగా తులాభారం వేసి సమర్పిస్తారు. గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.