అరకు: అరకులోయ మండలం గన్నెల పంచాయితీ తడక గ్రామాన్ని అరకు సిఐ హిమగిరి మంగళవారం సాయంత్రం సందర్శించారు. సిఐ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వలన జరిగే నష్టాన్ని వివరించి, గంజాయి పండించడం, రవాణా చేయడం నేరమని తెలిపారు. గంజాయి రవాణాలో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని యువతను హెచ్చరించారు. చిన్నారులకు బిస్కెట్స్ పంపీణీ చేశారు. సిఐ తో పాటూ ఎస్ఐ సంతోష్ ఉన్నారు.