ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రావులపాలెం డిపో కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఇందిరా కాలనీలో జరిగిన సభలో గౌరవ అధ్యక్షుడిగా తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డిపో అధ్యక్షుడిగా లంకా శ్రీనివాసరావు, కార్యదర్శిగా గీశాల ప్రసాదరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అడపా లక్ష్మీ నాగమల్లితో పాటు 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని ఘనంగా సన్మానించారు.