పేదల పట్టాలకు స్థలం చూపించాలి: సీపీఐ
NEWS Aug 27,2024 06:14 pm
ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి నగరంలో పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిందని, కానీ స్థలాలు చూపించలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే పేదలందరికీ స్థలాలు చూపించి, గృహ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు మంగళవారం రాజమండ్రిలోని ఇందిరానగర్‌లో సమావేశం నిర్వహించారు. స్థలాలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేశారని, ఆ స్థలాలు ఇప్పటికీ చూపించలేదన్నారు.