తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ కార్యవర్గం
NEWS Aug 28,2024 02:47 am
అమలాపురం డివిజన్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా సీహెచ్ గిరిధర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుమార్ రాజాగౌడ్, కార్యదర్శిగా వి.మోహన్ బాబు, కోశాధికారిగా కె.చముండేశ్వర రావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా డి.శ్రీనివాస్ రావు ఎన్నికయ్యారు.