మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ కార్యాలయానికి వస్తున్న సమయంలో కార్యాలయం ఆవరణంలో కాలు లేని వృద్ధ వికలాంగుడుని గమనించిన జిల్లా ఎస్పీ ఆయన వద్దకు వెళ్లి పోలీసు కార్యాలయానికి రావడానికి గల కారణాలు, అతని యొక్క వ్యక్తిగత సమస్యను అడిగారు. ఎల్.ఎన్.పేట మండలం కోవిలం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన పైలా మాదవయ్య నాటు కోళ్ళు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దొంగలించారని సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగా న్యాయం జరగలేదని తెలియజేసారు.