కవిత బెయిల్ ఆర్డర్ కీలకాంశాలు
NEWS Aug 27,2024 09:22 am
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. పాస్‌పోర్టును మేజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలి. కేసు ట్రయల్‌కు సహకరించాలి. విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి.