నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో గొలుసు దొంగతనం కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణం ద్యాగవాడకు చెందిన నిమ్మల నాగమ్మ బట్టలు ఉతకడానికి వెళుతున్న క్రమంలో మంగమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమె మెడలో ఉన్న తులం నర బంగారం గొలుసును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరుస చైన్ దొంగతనాలతో నిర్మల్ పట్టణంలోని మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు.