వానపల్లి గ్రామసభలో సీఎం కి అందిన ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించే దిశగా అధికారుల చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో వానపల్లి గ్రామ సభలో ఫిర్యాదుల ను పరిష్కరించే అంశంపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వానపల్లి గ్రామసభలో వివిధ సమస్యలపై రాష్ట్ర సీఎం కి సుమారు 391 ఫిర్యాదులు అందాయన్నారు.