చేపల వేటకు వెళ్లి ముగ్గురి గల్లంతు
NEWS Aug 27,2024 09:09 am
చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కూలీలు తాంసి మండలంలోని బండల్ నాగపూర్ గ్రామంలో గల బంధువుల ఇంటికి వచ్చారు. మంగళవారం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లగా వాగులో గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.