చెత్త సేకరణపై అప్రమత్తంగా ఉండాలి
NEWS Aug 28,2024 02:48 am
నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు నగర ప్రజలు సహకరించాలని, ముఖ్యంగా నగరంలోని అపార్ట్‌మెంట్ వాసులు, ఇతర గృహాల వారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఐఏఎస్ సూచించారు. అలాగే చెత్త సేకరణ విషయంలో నిర్లక్ష్యం వద్దని, ముఖ్యంగా తడి, పొడి చెత్త సేకరణ వేర్వేరుగా చేపట్టాలని కమిషనర్ భావన ఐఏఎస్ శానిటర్ సూపర్ వైజర్, ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు.