BREAKING: కవితకు బెయిల్ మంజూరు
NEWS Aug 27,2024 07:41 am
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు లో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని తెలిపారు.