గొల్లప్రోలులో రంగబాబు సేవలు చిరస్మరణీయం
NEWS Aug 28,2024 02:48 am
గొల్లప్రోలు పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మాదేపల్లి రంగబాబు 9వ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు అభివృద్ధికి రంగబాబు ఎంతో కృషి చేస్తారని వర్మ పేర్కొన్నారు.