భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఆదేశాల మేరకు విజయవాడ బీజేపీ కార్యాలయంలో ప్రజా సమస్యల, ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ సహకారంతో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు