ఏలేశ్వరం ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
NEWS Aug 28,2024 02:52 am
కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి పరిశీలించి విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్యులను ఆదేశించారు.