రాజమండ్రిలో పార్కులను సందర్శించిన నగర కమిషనర్
NEWS Aug 28,2024 02:51 am
రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో ఉన్న పార్కులను కమిషనర్ కేతన్ కర్గ్ సందర్శించారు. మున్సిపల్ కాలనీలో ఉన్న మున్సిపల్ కాలనీ పార్కులను సందర్శించి, స్థానిక ప్రజలను ఆ పార్కులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో పార్కును ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా మలిచేందుకు కృషి చేస్తామన్నారు. కబడ్డీ, ఖోఖో, బాస్కెట్ బాల్, వాలీబాల్ వంటి వివిధ క్రీడలను ఆడే విధంగా ప్రణాళికలను రూపుదిద్దామని అన్నారు.