ప్రస్తుతానికి వివాహ ప్రణాళికలు ఏమీలేవని... అలా అని వాటిని తోసిపుచ్చలేమని రాహుల్ గాంధీ అన్నారు. శ్రీనగర్‌కు చెందిన విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువతి పెళ్లి గురించి అడిగారు. ఇప్పుడు పెళ్లి ప్లాన్ లేనప్పటికీ, కొట్టి పారేయలేమన్నారు. పెళ్లి చేసుకుంటే తమను పిలవాలని వారు కోరారు. తప్పకుండా అందర్నీ ఆహ్వానిస్తానని రాహుల్ హామీ ఇచ్చారు.