కవిత బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ
NEWS Aug 27,2024 06:36 am
ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం. ట్రయల్ కోర్టుతోపాటు, హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత. సుప్రీంలో బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకుంది. కేటీఆర్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.