పరిసరాలను పరిశుభ్రంగా
ఉంచుకోవాలి: ఎంపీడీవో రమేష్
NEWS Aug 27,2024 06:12 am
వర్షాకాలం నేపథ్యంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దస్తురాబాద్ ఎంపీడీవో రమేష్ సూచించారు. మంగళవారం ఉదయం డ్రైడే కార్యక్రమంలో భాగంగా దస్తురాబాద్ మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ఇంటి పరిసరాల్లో నీరు ఎక్కడ నిలువ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.