పశువులకు వ్యాధుల నివారణకు వ్యాక్సిన్
NEWS Aug 27,2024 06:14 am
బూర్జ: మండలంలోని పాలవలస పంచాయతీ పీ రామన్నపేట గ్రామంలో పాడి పశువులకు పుట్&మౌత్ వ్యాధుల నివారణకు వాక్సిన్ ను వెటర్నరీ సిబ్బంది వేశారు.ఈ సీజన్లో పశువులకు వ్యాధులు ప్రబలకుండా నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెటర్నరీ అసిస్టెంట్ పేడాడ సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బందితో పాటు నాయకులు పతివాడ తిరుపతిరావు,రాకోటి ముకుందారావు, పాడి రైతులు పనస తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.