ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
NEWS Aug 27,2024 06:14 pm
కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ అవడంతో హాస్టల్లోని 26 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను హుటాహుటిన ఏలేశ్వరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ తక్షణ వైద్య సేవలు చేపట్టారు. ఫుడ్ పాజయిన్ అయిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.