అనపర్తిలో రైలు నుంచి జారిపడి ఒడిశా వాసి మృతి
NEWS Aug 28,2024 02:52 am
అనపర్తి రైల్వే స్టేషన్లో సోమవారం తెల్లవారు జామున రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట జీఆర్పీ ఎస్ఐ బి.లోవరాజు తెలిపారు. సామర్లకోట నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి ఒక ప్రయాణికుడు జారి పడి మృతి చెందాడు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు ప్రకారం ఒడిశాకు చెందిన చిత్రసేన్ దాస్(42)గా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.