పుష్ప స్టయిల్‌లో గంజాయి స్మగ్లింగ్
NEWS Aug 27,2024 06:17 am
పుష్ప సినిమా మాదిరిగా పాత ఫర్నిచర్ పేరుతో బొలెరోలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పెదబయలు నుంచి పాత పర్నిచర్ మాటున 820 కేజీల గంజాయి బొలెరోలో తరలిస్తున్నారు. తూ.గో జిల్లా గోకవరం మండలంలో పోలీసులు తనిఖీలు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మఠాలో కొందరూ తప్పించుకోగా ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.