అమలాపురంలో రేపు డయల్ యువర్ డీఎం
NEWS Aug 27,2024 06:28 am
అమలాపురం ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై 28వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను 9581932678 సెల్ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.