రేపు కాకినాడలో జాబ్ మేళా
NEWS Aug 28,2024 02:52 am
కాకినాడ నగరంలోని గాంధీనగర్లో ఉన్న బెస్ట్ కెరీర్ సంస్థ కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత కె.వి.రమణ తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన యువతీ, యువకులు విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరుకావాలని కోరారు.