సత్యదేవుని దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం
NEWS Aug 27,2024 06:32 am
శంఖవరం మండలంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం సోమవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 30 వేలమంది భక్తులు సత్యదేవుని దర్శించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులకు భోజనం పెట్టారు.