తూ. గోదావరిలో అర్హత లేని వారికి రూ.15 వేల పింఛన్
NEWS Aug 28,2024 02:53 am
మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం రూ.15 వేలు పింఛన్ అందిస్తోంది. కొంత మంది అనర్హులు ఈ పెన్షన్ అందుకుంటున్నారు. దీనిపై ఉమ్మడి జిల్లాలో గ్రామాల వారీగా సర్వే చేపట్టారు. కాకినాడ జిల్లాలో 323 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 1203 మంది, కోనసీమ జిల్లాలో 668 మంది ఈ పెన్షన్ అందుకుంటున్నారు. వారిలో అనర్హులున్నారని దివ్యాంగులు చేసిన ఫిర్యాదుపై సర్వే చేపట్టారు. నిపుణులైన వైద్యులచే ఈ సర్వే చేయిస్తున్నారు.