అరకులోయ మండలంలోని చొంపికి వెళ్లే రైల్వే గేటు పరిసర ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఎక్కువ అవుతుంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేయడానికి పాల్పడుతున్నాయని అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు మంగళవారం వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.