అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మృతి
NEWS Aug 27,2024 09:15 am
అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు మెస్రం సంధ్య ఆనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.సంధ్య పట్టణంలోని గెజిటెడ్ నంబర్ వన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.సంధ్య మృతి పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.