భారత్, పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్
NEWS Aug 26,2024 05:56 pm
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 6న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. మహిళల టీ20 వరల్డ్ కప్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ICC రిలీజ్ చేసింది. UAE వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ జరగనుంది. వాస్తవానికి ఈ ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యూఏఈకి తరలించారు