దూరవిద్య విధానంలో పై చదువులకు అవకాశం
NEWS Aug 26,2024 03:53 pm
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన యువత పైచదువుల కోసం దూరవిద్య విధానంలో చదువుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్త ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ పై ఆసక్తి ఉన్న వారు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్ ఎంఎస్సీ, ఎంఏలలో ప్రవేశాలు ఉంటాయన్నారు. ఈ నెల 31 వరకు ఇంటర్మీడియట్, డిగ్రీ చేసిన వారు పై చదువుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు.