మ్యూజియంకు పర్యాటకుల తాకిడి
NEWS Aug 26,2024 03:58 pm
అరకు: అరకులోయ గిరిజన మ్యూజియంను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఆదివారం, సోమవారం వరుస సెలవులు, వారాంతం కావడంతో పర్యాటకుల రాక పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. ఆది, సోమవారం గిరిజన మ్యూజియంను సుమారు 2700 మంది పెద్దలు, పిల్లలు మ్యూజియంను సందర్శించారన్నారు. ఈ 2 రోజులు రాత్రి సమయంలో వర్షం పడటంతో వాతావరణం చల్లగా మారి, పర్యాటకులకు శీతాకాల అనుభూతిని ఇచ్చింది.