జిల్లాలో నాటు తుపాకుల కలకలం
NEWS Aug 26,2024 04:01 pm
ఏపీలో మరోసారి నాటు తుపాకులు కలకలం రేపాయి. సత్యసాయి జిల్లా తలుపుల మండలం భూపతి వాండ్లపల్లిలో నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో నంబులపూలకుంట-తలుపుల సరిహద్దులో జంతువులను వేటాడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.