మంకీ పాక్స్ కు ప్రత్యేక వార్డు
NEWS Aug 26,2024 03:57 pm
మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఏపీలో కేసులు వస్తే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 6 పడకలు, అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేష్ వెల్లడించారు.